calender_icon.png 19 January, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఆపకుండా కొనసాగించాలి

13-08-2024 01:15:36 PM

స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం పై కలెక్టర్లతో  వీడియో  కాన్ఫరెన్స్

గ్రామాల్లో పారిశుధ్యం, ఫ్రై డే - డ్రై డే కార్యక్రమాన్ని కొనసాగించాలి: కలెక్టర్

రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ సీతక్క

వనపర్తి: స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఆపకుండా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్లతో  వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహించి ఇటీవల జరిగిన  స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో స్వచ్చదనం కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని సూచించారు.  కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శిస్తూ ఎక్కడా చెత్తా చెదారం లేకుండా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఇందిర మహిళా శక్తి కింద షెడ్యూల్డు కులాలు, తెగల ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా స్వయం సహాయక బృందాలు సభ్యత్వం లేని వారిని గుర్తించి సభ్యత్వం చేర్పించాలని సూచించారు.

స్వయం సహాయక మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు శిక్షణ ఇచ్చి చిన్నచిన్న పరిశ్రమలు నెలకొల్పే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. ఆగష్టు 5 నుండి 9 వరకు నిర్వహించిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని  బాగా నిర్వహించిన మండలాలకు, గ్రామ పంచాయతీలను గుర్తించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లాలో జరిగిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం వివరాలు వెల్లడించారు.

 గ్రామాల్లో పారిశుధ్యం, ఫ్రై డే - డ్రై డే కార్యక్రమాన్ని కొనసాగించాలి: కలెక్టర్ 

అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, ఫ్రై డే - డ్రై డే కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు.  చెత్తను రోడ్డు పైన, బయట   పడేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని డి.పి ఓ ను ఆదేశించారు.   గ్రామ రహదారి పొడవునా, లే అవుట్ ఖాళీ స్థలంలో మొక్కలు నాటించాలసి ఆదేశించారు. మహిళా శక్తి కింద మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ ఇచ్చి యూనిట్లు నెలకొల్పే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, పిడి డిఆర్డిఓ ఉమాదేవి, జెడ్పి సీఈవో యాదయ్య, డిపిఓ,  రమణమూర్తి, అడిషనల్ డి ఆర్ డి ఓ నాగేంద్ర, జిల్లా వైద్యశాఖ తరఫున డాక్టర్ సాయినాథ్ డిఎల్పిఓ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.