calender_icon.png 15 March, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో పార్టీ స్థితిగతులపై సీతక్క సమీక్ష

12-03-2025 01:34:30 AM

ఉమ్మడి జిల్లా నాయకులతో సమావేశం

ఆదిలాబాద్, మార్చి 1౧ (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, తదితరంశాలపై నేతలతో సమీక్షించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీని అన్ని నియోజవర్గాల్లో పటిష్టపర్చలని, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లలని సూచించారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ద్యేయం అన్నారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విట్టల్,  ఎమ్మెల్యే లు ప్రేమ్ సాగర్ రావు, వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా సీనియర్ నేతలు వేణుగోపాల చారి, సోయం బాపూరావు, రేఖా నాయక్, విట్టల్ రెడ్డి, ఆయా నియోజవర్గాల ఇంచార్జ్ లు పాల్గొన్నారు.