05-04-2025 02:12:56 AM
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా కొత్తకోట సీతాదయా కర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులుగా కంచర్ల వందన్‌గౌడ్, బి.అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి. వచన్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం మధురానగర్‌లోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయంలో సీతాదయాకర్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.