calender_icon.png 23 December, 2024 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జున్ డైరెక్షన్‌లో సీతా పయనం

17-10-2024 12:00:00 AM

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా తిరిగి దర్శకుడిగా మారారు. గతంలోనూ డైరెక్టర్‌గా అర్జున్ మంచి చిత్రాలను తెరకెక్కించారు. సుమారు ఆరేళ్ల విరామం తర్వాత తిరిగి సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. కొత్త సినిమాను ఆయన సామాజిక మధ్యమాల వేదికగా ప్రకటించారు. అయితే అర్జున్ 2022లో విశ్వక్‌సేన్ హీరోగా ఐశ్వర్యా అర్జున్, జగపతిబాబు కాంబోలో ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఏమైందో ఏమో కానీ ఈ సినిమా తర్వాత రద్దయింది.

తను ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘సీతా పయనం‘ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ లోగోను అర్జున్ ఆవిష్కరించారు. ఈ సినిమాను మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు. తొలుత కన్నడలో, తర్వాత తెలుగు, తమిళంలో రూపొందిస్తారని సమాచారం. ఈ చిత్రంలో కన్నడ నటుడు నిరంజన్ సుధీంద్ర ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.