29-03-2025 01:27:33 AM
ముంథని, మార్చి 28 (విజయక్రాంతి): శిథిలావస్థలో ఉన్న ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీలో పంచాయతీ సిబ్బంది అరకురో విధులు నిర్వహిస్తున్నారు. నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరైన నిధులు లేక పోవడంతో పనులు నిలిచిపోయాయి.
నిధులు మంజూరు చేసి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ను సీతంపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ భవనం లేకపోవడంతో శిథిలావస్థలో ఉన్న పాత గ్రామపంచాయతీలోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, పాత గ్రామపంచాయతీ లో సమావేశాలు నిర్వహించడం, గ్రామసభలు నిర్వహించడం చాలా ఇబ్బందులు అవుతున్నాయని పంచాయతీ కార్యదర్శి మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఐదు సంవత్సరాల క్రితం దాదాపు పది లక్షల పైన నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో స్లాప్ లెవెల్ పనులు జరిగి, పనులు నిలిచిపోయాయి.దీంతో గ్రామంలో గ్రామపంచాయతీ భవనం లేక గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాను గత ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశానని, గత ప్రభుత్వంలో ఎన్ని సార్లు గ్రామపంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేయాలని అప్పటి కలెక్టర్ ను, ప్రజాప్రతినిధులను కోరినప్పటికీ నిధులు మంజూరు చేయకపోవడంతో పాత గ్రామపంచాయతీలోనే ఇబ్బందులు పడుకుంటూ విధులు నిర్వహించామని, ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు చేయించి నూతన గ్రామ పంచాయతీని పూర్తి చేయాలి.
తాజా మాజీ సర్పంచ్ పులిపాక నాగేష్