హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ) హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఈనెల 6 నుంచి 9 వరకు నిర్వహించే పరీక్షలకు మాత్రమే హాల్‌టికెట్లను విడుదల చేశారు. మిగతా పరీక్షల హాల్‌టికెట్లను తర్వాత విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సీపీగెట్ పరీక్షలు ఈనెల 15 వరకు జరగనున్నాయి.