మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేస్తూ బిజీగా మారుతున్నారు. అయితే, చిరు.. సీనియర్ దర్శకులతో కాకుండా యువ డైరెక్టర్స్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘విశ్వంభర’ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. దీని తర్వాత చేయబోయే ప్రాజెక్టు ప్రకటన సైతం వచ్చింది. ఆ కొత్త చిత్రానికి హీరో నాని సమర్పకుడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్‌కు వీరాభిమానులైన నాని, శ్రీకాంత్ ఓదెల చిరుతో పనిచేయడం ఆసక్తికరం.
నాని అనానిమస్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సిని మాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ప్రీ లుక్ పోస్ట ర్‌లో ‘అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు’ అనే వ్యాఖ్య రాసి ఉండటాన్ని బట్టి చిరంజీవికి ఇది మోస్ట్ వైలెంట్ సినిమా కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్, నాని కలిసి చేస్తున్న ‘ది ప్యారడైజ్’ పూర్తయిన తర్వాతే చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లనుం ది. ఇదిలా ఉంటే మెగాస్టా చిరంజీవి మరో యంగ్ డైరెక్టర్‌తో చేతులు కలపనున్నారనే ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అనిల్.. చిరంజీవితో సినిమా చేస్తారని, వెంకీ సినిమా తర్వాత చిరు సినిమా కథపై పనిచేస్తారని టాక్.