calender_icon.png 17 November, 2024 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు బెయిల్ కోరుతూ..

13-11-2024 12:00:00 AM

నటి కస్తూరి ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. కేసును విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేష్.. కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. కస్తూరికి సమన్లు అందజేసేందుకు ఎగ్మోర్ పోలీసులు కస్తూరి ఇంటికి వెళ్లగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంది.

ఆమె మొబైల్ కూడా స్విచ్చాఫ్ చేశారు. కాగా.. తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజలపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో కస్తూరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారంటూ వివాదానికి తెర లేపారు. ఆమెపై వివిధ సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై సహా పలు ప్రాంతాల్లో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.