న్యూఢిల్లీ, అక్టోబర్ 19: హమాస్ మిలిటెంట్ అధినేత.. అక్టోబర్ 7 దాడులకు కారకుడైన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో సిన్వర్‌ను హతమార్చిన ఆపరేషన్‌లో పాల్గొన్న ఇజ్రాయెల్ లెఫ్టినెంట్ కల్నల్ ఈథమ్.. అతడి డెడ్‌బాడీ వద్ద ఒంటరిగా ఉన్న క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘సిన్వర్ చనిపోయిన తర్వాత అతడి మృతదేహం వద్ద ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా శిథిలమైన నగరాన్ని చూశా. అతడి డెడ్‌బాడీని చూడగానే కాసేపు బాధేసింది. అతడూ ఒకప్పుడు ఏం తెలియని పిల్లవాడే. వయస్సు పెరిగినకొద్ది చెడు తోవను ఎంచుకున్నాడు. సిన్వర్ మరణం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది. మేము కలిసి పోరాడుతాం.. గెలుస్తాం’ అని పోస్ట్ చేశారు.
నెతన్యాహూ ఇంటిపై డ్రోన్ దాడి
ఇజ్రాయెల్‌లోని సిసేరియా పట్టణంలో ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు చెందిన ప్రైవేట్ నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ సమయంలో ఆ ఇంట్లో నెతన్యాహూ, ఆయ న సతీమణి సహా ఎవరూ లేరని తెలుస్తో ంది. హమాస్ నేత యహ్యా సిన్వార్ హత్య తర్వాత ఈ డ్రోన్ దాడి జరగటంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు. లెబనాన్ నుంచి డ్రోన్‌ను లాంచ్ చేసి ఉంటారని ఇజ్రాయెల్ మిలిటరీ అంచనా వేస్తోంది.
గాజాపై దాడిలో ౩౩ మంది మృతి
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జాబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ శనివారం వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ౩౩ మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో ౨౧ మంది మహిళలు ఉన్నారని గాజా ప్రభుత్వ మీడి యా వెల్లడించింది. కాగా, హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతిచెందినప్పటికీ హమాస్ ఉనికి విషయంలో ఎటువంటి సమస్య లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఉద్ఘాటించారు. సిన్వర్ మృతి బాధకలిగిస్తోందని తెలిపారు. కీలక నేతల బలిదానంతో హమాస్ మరణించదని, సిన్వర్ స్ఫూర్తితో ఉద్యమం కొనసాగుతుందని అన్నారు
*ఇజ్రాయెల్ సైనికుడి వ్యాఖ్య
*గాజాపై ఇజ్రాయెల్ దాడిలో ౩౩ మంది మృతి
*హమాస్ ఎప్పటికీ అంతంకాదు: