04-04-2025 12:20:44 AM
కడ్తాల్, ఏప్రిల్ 3 ( విజయ క్రాంతి ) : తెలంగాణ తొలి విత్తన పండుగకు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని ఆన్మాస్పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్ సెంటర్ సిద్ధమైంది. నేటి నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో విత్తన పండుగ నిర్వహించ నున్నారు. ఆరోగ్యానికి ఆహార భద్రత కల్పించ డమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మని.. దేశీ విత్తనాల ప్రదర్శన, ఉచిత పంపిణీ, విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సంప్రదాయ విత్తనాల వైభవాన్ని తెలియజేసేందుకు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లుపేర్కొన్నారు. రైతులు, పాలసీ మేకర్స్ని ఒకే వేది కపైకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.
వ్యవసాయ, పర్యావరణ నిపుణులతో పాటు, పాలసీ మేకర్స్ పెద్ద ఎత్తున తరలిరానున్నారని వారు వివరించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నర్సింహా రెడ్డి, పర్యావరణవేత్తలు పురు షోత్తం రెడ్డి, సాయి ప్రభాకర్ రెడ్డి, ఉమా మహే శ్వర్ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు.
విత్తనాల స్టాల్స్ ఏర్పాటు..
ఎర్త్ సెంటర్లో మూడు రోజులు నిర్వహించనున్న విత్తన పండుగకు సంబంధించి కేరళ, తమిళనాడు, ఒడిశా, మహారా ష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విత్తన నిపు ణులు హాజరు కానున్నారు. విత్తనం, విత్తన జ్ఞానం, అనుభవాల ప్రదర్శ నలకు ఎర్త్ సెంటర్లో 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు.