‘దేవర పార్ట్ 1’ సినిమా విజయంతో కెరీర్ పరంగా మంచి జోష్ మీదున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. అయితే కారణమేదైనా కొద్దికా లంగా తనను అభిమానించే ఫ్యాన్స్‌ను కలుసుకోలేకపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తన అభిమానులను కలుసుకోవడానికి హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ‘దేవర’ ప్రీ రిలీజ్ అనివార్య కారణాల వల్ల రద్దయింది.
అలా అభిమానులకు, ఎన్టీఆర్‌కు మధ్య దూరం పెరిగింది. ఇదీగాక గతంలో ఎన్టీఆర్ తన ఆఫీస్ వద్ద అభిమానులు తనను కలిసి సాదకబాధకా లు చెప్పుకునేందుకు సమయం కేటాయించేవారని, ఆ వాతా వరణం కొంత కాలంగా కనిపించటం లేదన్న విమర్శ లు ఇటీవల ఎక్కువయ్యాయి.
తమ అభిమాన నటుడిని కలుసుకునేందుకు ఫ్యాన్స్ తీరొక్క ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మంగళవారం ఓ లేఖను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘నన్ను కలుసుకోవడానికి అభిమానులు ఎదురు చూస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. వారి ఆసక్తిని అర్థం చేసుకొంటున్నాను.
అందుకే త్వరలోనే సజావుగా ఓ మీటింగ్ ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా కలువాలని నిర్ణయించుకొన్నాను. పోలీసులు, ఇతర అధికారుల అనుమతి కోరు తున్నాం. కొంత సమయం అవసరమవుతుంది. కాబట్టి అప్పటివరకు సహనంతో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలాంటి పాదయాత్ర చేయకూడదు.
మీ ఆనందమే కాదు.. మీ భద్ర త, సంక్షేమం నాకు అత్యంత ప్రధానం’ అని ఎన్టీఆర్ కోరారు. ఇదిలా ఉండగా కొద్దికాలంగా నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులకు ఏదైనా దిశానిర్దేశం చేస్తారా? అనే విష యంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.