calender_icon.png 17 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరణించినా ప్రపంచాన్ని చూడండి

17-01-2025 01:39:39 AM

మహబూబ్ నగర్, జనవరి 16 (విజయ క్రాంతి) : నేత్రదానం చేయండి.. కళ్ళు లేని వారికి కంటి చూపులు ఇవ్వాలని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు. విశ్రాంత ఎఓ తాళ్ళగడ్డ నరసింహ రెడ్డి (65) మరణించడంతో అతని కోరిక మేరకు కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎఓగా విధులు నిర్వహించి పదవీ విరమణ తదుపరి జడ్చర్లలో నివాసం వుంటున్న నర సింహా రెడ్డి అనారోగ్య కారణాల రీత్యా మహబూబ్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఆయనకు భార్య లలిత, కుమారుడు రాజేశ్వర్ రెడ్డి, కుమార్తె కీర్తి ఉన్నారు. మరణాంతరం తన నేత్రాలను దానం చేయలనే  నర సింహా రెడ్డి కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు  ప్రజా సంఘాల ఐక్య వేదిక  అధ్యక్షులు యం.ప్రవీణ్ ను సంప్రదించారు. ఈ విషయంగా ప్రవీణ్ కుమార్ రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ కు సమాచారం అందించారు. ఈ మేరకు వారు ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి కి చెందిన టెక్నీషియన్ శివకు సమాచారం అందించారు.

సత్వరమే స్పందించిన శివ కుమార్ ఆసుపత్రికి  చేరుకొని నరసింహా రెడ్డి  నుంచి కార్నియాను సేకరించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యు లకు కార్నియా సేకరించినట్లు   టెక్నిషియన్  శివ ధవ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా  ప్రవీణ్ కుమార్  నేత్ర దానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు. మరణానంతరం నేత్ర దానం చేస్తే ఇద్దరికి చూపును ఇచ్చిన వారమవుతామని అన్నారు. కాగా నేత్ర దానం చేసేందుకు 9666900900ను సంప్రదించాలని నటరాజ్ కోరారు.