calender_icon.png 29 April, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భోజ్‌పురి గాయకురాలిపై దేశద్రోహం కేసు

28-04-2025 11:45:01 PM

దేశ సమగ్రతను దెబ్బతీసేలా నేహా సింగ్ వ్యాఖ్యలు...

న్యూఢిల్లీ: భోజ్‌పురి గాయకురాలు నేహా సింగ్ రాథోడ్‌పై లక్నో పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన కారణం పాలక ప్రభుత్వం నిఘా వైఫల్యం, భద్రతా లోపాలే కారణమని నేహా సింగ్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.  నేహా సింగ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆమె వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేహా సింగ్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసినట్టు లక్నో పోలీసులు వెల్లడించారు.  దీంతో ఆమెపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 124ఏ కింద దేశద్రోహం, క్రిమినల్ కోడ్ సెక్షన్ 152 కింద దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం కింద అభియోగాలు మోపినట్టు పోలీసులు తెలిపారు.