05-03-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్, మార్చి 4: ఈ నెల5 వ తేది నుండి 25 వ తేది వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.ఈ పరీక్షలు జరుగుతున్న తేదీలలో ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద 163, 144 చట్టం అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్లో నుండి పరిక్షా పత్రాలు పరిక్షా. కేంద్రానికి వెళ్ళే సమయంలో కానిస్టేబుల్ తప్పనిసరిగా ఎస్కార్ట్ వుండాలని సూచించారు. మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎస్పీ విద్యార్థులకు సూచించారు.