- ఈతకు వెళ్లి ఐదుగురి మృతి బాధాకరం
- పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): కొండపోచమ్మ సాగర్‌లో ఈతకు వెళ్లి ఐదుగురు మృతిచెందడం చాలా బాధాకరమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం మరణించిన వారికి సంతాపం ప్రకటించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడు తూ కొండపోచమ్మసాగర్‌లో ఇప్పటికే చాలా మంది చని పోయారని.. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగ కుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని, జలాశయం వద్ద భద్రతను పెంచాలని, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకొనే విషయ మై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు.