calender_icon.png 23 March, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవల్లి 10 పరీక్షకేంద్రంలో భద్రత కరువు

22-03-2025 08:30:05 PM

రేవల్లి: మండల కేంద్రం రేవల్లిలో కొనసాగురున్న 10 పరీక్ష కేంద్రానికి స్థానిక అధికారుల పర్యవేక్షణ కరువడంతో పరీక్ష కేంద్రానికి భద్రత గాలిలో దీపంలా మారింది, ఈ పరీక్షా కేంద్రంలో  ఏదుల, చెన్నారం, తలుపునూరు, రేవల్లి, గ్రామాలకు చెందిన 178 మంది విద్యార్థినీ విద్యార్థులు 10 పరీక్ష రాస్తున్నారు. ఈ కేంద్రానికి మండల తాసిల్దార్, ఎంఈవో  పరీక్షాకేంద్రం బయట లోపల అనునిత్యం పర్యవేక్షిస్తుంటారు. పరీక్షా కేంద్రంలో చీఫ్ ఎగ్జామినర్ ఉండగా, జిల్లా అదనంగా ఫ్లయింగ్ స్కార్డులు, సంబంధిత జిల్లా అధికారులు పర్యవేక్షణ తనిఖీలు చేస్తుంటారు. స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు పరీక్షా కేంద్రం చుట్టుముట్టు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఆయనతో పాటు ముగ్గురు రక్షకబడులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి గస్తీ తిరుగుతుంటారు.

కాగా స్థానిక పోలీసులు పరీక్షా కేంద్రం ప్రధానగేట్ వద్ద ఉండాల్సిన ఇద్దరు రక్షకభటులకు ఒకరు దూరంగా చెట్టుకింద ఉండగా రెండో ద్వారం దగ్గర ఎలాంటి భద్రత లేకపోవడంతో అక్కడే ఎంపీడీవో కార్యాలయం ఉండడంతో కార్యాలయానికి వచ్చివెల్లేవారు, లేదా దానిని సాకును చేసుకొని పరీక్ష కేంద్రంలోకి సునాయాసంగా వెళ్లి రావచ్చు,అదేవిధంగా పరీక్ష కేంద్రానికి పడమటి వైపున నివాస కేంద్రాలు ఉండగా, అటు నుంచి పరీక్ష కేంద్రానికి ప్రహరీ గోడ ఉండగా అట్టి గోడను ఎవరైనా సునాయాసంగా ఎక్కి పరీక్షా కేంద్రానికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అక్కడ ఒక్క రక్షకభటుడు కూడ లేడు, అంతే కాకుండ అనునిత్యం పర్యవేక్షించాల్సిన స్థానిక ఎస్సై, తాసిల్దార్, ఎంఈఓ లలో ఒక్కరు కూడ అటువైపు వెళ్లొచ్చిన దాఖలాలు లేవు అనిఅక్కడి నివాస ప్రాంత ప్రజలు అంటున్నారు. మండల అధికారులకు జీతభత్యాలతోపాటు ఈ విధమైన పర్యవేక్షణ, గస్తీలకు వేల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం వాహనాలు సమకూరుస్తున్న నిర్లక్ష్యం వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇలా పరీక్ష కేంద్రానికి భద్రత లేకపోవడం వల్ల లోపల ఉండాల్సిన ప్రశ్నాపత్రాలు నిమిషాల్లో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని, పరీక్షా కేంద్రానికి నిఘా ఏర్పాటు చేయాల్సిన అధికారులు గ్రామంలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లపై పడి భయభ్రాంతులకు గురిచేస్తూ మూసేపించడం విమర్శలకు దారితీస్తుంది, పరీక్షలు ప్రారంభమై రెండు రోజులు అవుతున్న అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వ్యవహరించడం సమంజసం కాదని ఇప్పటికైనా స్థానిక అధికారులు పరీక్షా కేంద్రానికి గట్టి భద్రత ఏర్పాటు చేసి పది పరీక్షలు రాస్తున్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.