calender_icon.png 18 April, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

10-04-2025 10:49:23 PM

చర్ల (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా మావోయిస్టలు భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకొని ఐఈడీ బాంబును అమర్చారు. భద్రతా బలగాలు చాకచక్యంగా నాలుగు ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశారు. జెటిఎఫ్ క్యాంప్ భీమారం నుండి కోబ్రా 204 బృందం ఐఈడీ బాంబును భీమారం నుండి 2 కిలోమీటర్ల దూరంలో పుసాగుఫా వద్ద బీర్ బాటిల్‌లో మావోయిస్టులు అమర్చిన ఒక ఐఈడీ బాంబుతో సహా మొత్తం నాలుగు ప్రెజర్ ఐఈడీలను రహదారి వెంట కనుగొన్నారు. ఈ నాలుగు ఐఈడీ లను 204 కోబ్రా బీడీ  బృందం ఐఈడీ లను సురక్షితంగా నిర్వీర్యం చేయడం ద్వారా భద్రతా బాలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది.