22-03-2025 06:03:30 PM
- పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం..
- పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా..
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కె. నాగరాజు గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియ అందజేశారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో నాగరాజు భార్య విజయ కుమారికి 7,84,762/- రూపాయల భద్రత ఎక్స్ గ్రేషియా చెక్ ను సీపీ అంబర్ కిషోర్ ఝా అందజేశారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసే విదంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి. రాజు, ఏఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ సంధ్య, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, తదితరులు పాల్గొన్నారు.