18-03-2025 11:33:53 AM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జడ్చర్ల బస్టాండ్(Jadcherla RTC Bus Stand)లో ప్రయాణికులు నుంచి ఫోన్లు చోరీ చేసిన వారిని గుర్తించి పట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల బస్టాండ్ లో ప్రయాణికులు నిత్యం వేలాదిమంది వివిధ ప్రాంతాలకు రాకపోలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హడావిడిగా బస్సులు ఎక్కే సమయంలో ఇద్దరు వ్యక్తులు బస్సు ఎక్కుతున్న వారి నుంచి సెల్ ఫోన్(Cell phone) లాక్కొని తీసుకున్న దృశ్యాలను చూసి పట్టుకునేందుకు ప్రయత్నం చేశాం. ఇద్దరు వ్యక్తులు ఫోన్లు తీసుకొని జడ్చర్ల ఫ్లైఓవర్(Jadcherla Flyover) నుంచి పరుగులు తీశారు.
బస్టాండ్ లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ నరసింహులు సెల్ ఫోన్స్ చోరీ చేసిన వ్యక్తులను పట్టుకునేందుకు పరుగులు తీసి చివరికి స్థానికుల సహకారంతో పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ సిబ్బంది జడ్చర్ల బస్టాండ్ వచ్చేసి వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేస్తుండ్రు. వారి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి చూడగా ఇప్పటికే వారు పలుమార్లు వివిధ నేరాలలో జైలుకు సైతం వెళ్లి వచ్చినట్లు తెలిసింది. చోరికి పాల్పడిన వారు నిజామాబాద్ జిల్లా(Nizamabad District)కు చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియవలసి ఉంది.