calender_icon.png 20 April, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20వేల మంది పోలీసులతో బందోబస్తు

04-04-2025 12:53:36 AM

శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి

డీజేలు, బాణసంచా వినియోగం మానుకోవాలి

పోలీస్ డ్రోన్లతో పర్యవేక్షణ, ఇతరులు వాడాలంటే తప్పని సరి అనుమతి

హైదరాబాద్ సీపీ సీవీఆనంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3(విజయక్రాంతి) : నగరంలో ఈ నెల 6న నిర్వ హించబోయే శ్రీరామ నవమి శోభాయాత్రకు 20వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించబోతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషన ర్ సీవీ ఆనంద్ తెలిపారు. శోభాయాత్ర ప్రశాంతంగా సమయానికి జరిగేలా సహకరించాలని నిర్వహణ కమిటీలను కోరారు.

గురువారం మంగళ్‌హాట్ సీతారామ్‌బాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో పోలీస్, జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, తదితర శాఖల అధికారులు, శోభాయాత్ర నిర్వాహకులతో సమన్వ య సమావేశం నిర్వహి చారు. ఈ సందర్భంగా నిర్వాహకుల అభిప్రాయాలు, సమస్య లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాం బాగ్ నుండి  హనుమాన్ వ్యాయామ శాల వరకు కొనసాగే శోభాయాత్రను మధ్యాహ్నం 1గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాల న్నారు.

2010లో ప్రారంభమైన శ్రీరామ నవమి శోభాయాత్ర అనతి కాలంలోనే దేశ వ్యాప్తంగా ఖ్యాతి పొందిందన్నారు.  గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని,  శోభా యాత్ర జరిగే దారులు చాలా చిన్నగా ఉన్నందున, పెద్ద టస్కర్ వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు  కావున ముందస్తుగా వాహనాలతో ఒక ట్రయల్ రన్ ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ సమితి సభ్యులకు సూచించారు. డిజె సౌండ్ వాడటము వాలన ప్రజలకు గుండె జబ్బులు, వినికిడి సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రన్నారు.

డీజేలు, బాణసంచా వినియో గం లేకుండా శోభాయాత్రను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. పోలీసు శాఖ తరపున డ్రోన్ల సహాయంతో నిఘా ఉంటుందని, ఇతరులు డ్రోన్లు వాడాలనుకుంటే స్థానిక పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఐసిసిసి బిల్డింగ్ నందు జాయింట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి శోభా యాత్ర ను పర్యవేక్షిస్తామని తెలిపారు. శోభా యాత్రలో ఇతర వర్గాలను కిం చపరిచే విధంగా పాటలు, స్పీచ్ లు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశా రు.

ప్రజలు  నిబంధనలు పాటిం, భక్తి శ్రద్దలతో   పండుగలు జరుపుకోవాలని కోరా రు. శోభా యాత్ర నిర్వాహ కులు విగ్రహాల ప్రతిమల ఎత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఆర్‌అండ్‌బీ అధికారులు ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని, టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులు 24గంటలు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, జలమండలి అధికారులు తాగునీటిని అందుబాటులో ఉంచా లని, జీహెచ్‌ఎంసీ అధికారులు శానిటేషన్ సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు.

జిహెచ్‌ఎంసి  అడిషినల్ కమిషనర్  రఘుప్రసాద్ మాట్లాడుతూ శ్రీ రామనవమి శోభా యాత్ర  సందర్భంగా రోడ్ల మరమ్మతులకు, వీధి దీపాలకు, ఇతర వసతుల ఏర్పాట్ల కొరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అనంతరం అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి సీపీ సివి ఆనంద్ శోభా యాత్ర ప్రధాన ఊరేగింపు మార్గాన్ని  పరిశీలించారు.

కార్యక్రమంలో అడిషినల్ సిపి లా ఆండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సిపి ట్రాఫిక్ .జోయల్ డేవీస్, డిసిపి సౌత్ వెస్ట్ జోన్ .జి.చంద్ర మోహన్, డీసీపీలు బీ. బాలస్వామి, రఘు ప్రసాద్ అడిషనల్ కమిషనర్ జిహెచ్ ఎంసి, డివై.ఆర్.ఎం ఆర్టిసి శ్రీనివాసరావు, భాగ్యనగర్ ఉత్సవ నిర్వాహకులు. భగవంతరావు, ఆర్గనైజర్. కృష్ణ, శ్రీ.గోవింద్ రాట్కే, ఆనంద్ సింగ్, డిఎఫ్‌ఓ వెంకన్న, వాటర్ వర్కర్స్ డైరెక్టర్ అమరెందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు