07-04-2025 01:18:05 AM
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు చూసి పునీతులైన భక్తులు
భక్తులతో కిటకిటలాడిన శ్రీ సీతారాముల కల్యాణ మండపాలు
సీతారామచంద్రుల కల్యాణ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీను బాబు
మంథని, మార్చి 6 (విజయక్రాంతి): శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుక్లపక్షం నవమి తిథి అయిన ఆదివారం లోకకళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో భక్తులు కనుల పండుగగా నిర్వహించారు. మంథని నియోజకవర్గంలో శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణ వేడుకలకు తిలకిడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ వేడుకలను చూసి పునీతులయ్యారు. మంత్రి స్వగ్రామం ధన్వాడలో మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు సోదరు డు శ్రీనుబాబు కళ్యాణంలో పాల్గొన్నారు. సీతరామల కళ్యాణం చైత్రశుద్ద నవమి సందర్భంగా నిర్వహించే కల్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఉదయం ముహూర్త సమయానికి ప్రారంభమయ్యే కళ్యాణ వేడుకలు వేద పండితులు శాస్త్రృత్తంగా నిర్వహించారు. ఉదయం 9-30 నుండి కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలకు నిర్వహించారు. మంథని పట్టణంలోని గోదావరి నది తీరంలో గల శ్రీ కోదండ రామాలయంలో, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో, శ్రీరామ నగర్ లోని రామాలయంలో, ఖమ్మంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో, ఎగ్లాస్పూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అలాగే అన్ని గ్రామాల్లోని కళ్యాణ వేడుకలు నిర్వహించారు.
కళ్యాణము ప్రాముఖ్యత:
సత్యానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైన శ్రీ రామచంద్రుల కల్యాణ వేడుకలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో నిర్వహిస్తుండడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే రామరాజ్యం రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. పాతివ్రత్యానికి సీతాదేవి, పితృ వాక్య పరిపాలనకు రామచంద్రుడు చిరస్థాయిగా నిలిచిపోయారు.
భక్తులకు అన్నదానం
కరీంనగర్, ఏప్రిల్6 (విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని శ్రీరాంనగర్ కాలనీ లోని రామాలయంలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దంపతులు.. ఈ సందర్బంగా రామ భక్తులకు చైర్మన్ దంపతులు అన్న దాన వితరణ చేశారు. కళ్యాణ మహోత్సవంలోరామ మందిర కమిటీ బాద్యులు మాధవరావు, ఆంజనేయులు,సాగర్ రెడ్డి, నరోత్తంరెడ్డి, రామకృష్ణ రెడ్డి, వసంత రావు, నరసింహా చారి తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ..
హుజురాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాం తి): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా సాగింది. భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లందకుంటలో జరుగుతుండడంతో జిల్లా నలుమూ లల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణానికి తరలివచ్చారు. హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలమాలలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య ఇల్లంతకుంట దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితరులు స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు. దేవస్థానంలో ఈ నెల 4 నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 16 వరకు కొనసాగనున్నాయి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి కల్పిం చారు. స్వామి వారి కళ్యాణాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తులు వీక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, ఆర్డిఓలు రమేష్, మహేష్ ఏసీపీ శ్రీనివాస్, దేవస్థానం ఈవో సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా జరిపిన అర్చకులు, హాజరైన ప్రముఖులు...
జగిత్యాల, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. జిల్లాలోని అత్యంత ప్రాచీనాలయాలు శ్రీధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంతో పాటూ జగిత్యాల ధరూర్ క్యాంప్ కోదండ రామాలయం, బ్రాహ్మణ వీధి రామాలయం, కోరుట్లలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం, కోదండ రామాలయాలలో సీతారాముల కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు కళ్యాణోత్సవాల్లో నిర్వాహకులు అన్న ప్రసాదాన్ని వితరణ చేయగా భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వీకరించారు. ఈ వేడుకల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణాల్లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి
మానకొండూర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీస్సులు ఆయనకు అందజేశారు.తిమ్మాపూర్ మండలం అల్గునూర్, పొలంపల్లి గ్రామాల్లో, మానకొండూర్ మండల కేంద్రంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తుల కోరిక మేరకు బోరింగు, ఆలయానికి వచ్చే భక్తుల కోసం విశ్రాంతిభవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో.. నగరం మాజీ డిప్యూటీ చల్ల స్వరూపారాణి హరిశంకర్ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆల అర్చకులు బైరి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగాయి. స్వామివారి కల్యాణోత్సవానికి చల్ల స్వరూప రాణి హరిశంకర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. కన్యాదాత తరపున కల్వకుంట్ల సహజ ప్రమోదరావు దంపతులు పాల్గొన్నారు కన్యాదాత స్వీకర్తగా పాత మాలతి శేఖర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చల్ల హరికృష్ణ, ఆలయ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రాజేందర్, భక్తులు, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
నయనానందకరంగా సాగిన శ్రీసీతారాముల కల్యాణం
హుజురాబాద్, విజయక్రాంతి: ఏప్రిల్6: జగదానంద కారకుడు, జగదాభి రాముడి కల్యాణ వేడుక కరీంనగర్ జిల్లా హుజురాబా ద్ డివిజన్లో ఆదివారం కనుల పండువగా సాగింది హుజురాబాద్ పట్టణంలోని రామాలయం, పాటి మీది హనుమాన్ టెంపుల్ లో, హుజురాబాద్ మండలంలోని చెల్పూరు గ్రామంలో, జమ్మికుంట రామాలయంలో, వీణవంక మండలంలో నీ పలు ఆలయాల్లో వేద పండితులు శ్రీకాంత్ ఆచార్య, రామయ్య , తిరుమలయ్య , ఉదయమర్రి కృష్ణమూర్తి శర్మ వేదమంత్రో చరణల మధ్య కనులపండుగగా సాగింది. ఆలయ ధర్మకర్తలు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
మధ్యా హ్నం జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. గ్రామ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులా రా వీక్షించి పులకించారు. కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ దేవుడి కృపకు పాత్రులు అయ్యారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. శ్రీరామ నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది.
గ్రామ పెద్దలు, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్బంగా కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించు శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవానికి దాదాపు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఆదివారం ఉదయం ఆలయం, కల్యాణ మండపం, వి.ఐ.పి. గ్యాలరీలను హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ తో కలిసి సిపి బందోబస్తును పర్యవేక్షించారు. కల్యాణ మండపంకు వెళ్లే ప్రవేశ మార్గం వద్ద ఏర్పాటు చేసిన డి.ఎఫ్.ఎం.డి. లు, ఈ కార్యక్రమం కొరకు పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును, ఆలయ పరిసరాలను పోలీసు కమీషనర్ స్వయంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖ తరుపున అవసరమైన అన్నీ భద్రతా చర్యలు చేపట్టామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ తెలిపారు.
కనుల పండుగగా
సిరిసిల్ల, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): తెలంగాణలోని అతిపెద్ద హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ అర్చకులు రాజరాజేశ్వర స్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సీతారామచంద్ర స్వామికి పంచోప నిషత్ ద్వారాభిషేకం వేద మంత్రలతో నిర్వహించారు. అనంతరం ఆలయంలోని సీతారామచంద్రస్వామి మూల మూర్తికి కళ్యాణం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయ వెనుక భాగంలోని చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కళ్యాణాన్ని అర్చకులు వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు కన్యాదాతలుగా రాచకొండ భాను కాంతి దంపతులు వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు వేములవాడ ఎమ్మె ల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్‌లు సమర్పించారు. పెద్ద సంఖ్యలో శివపార్వతులు, జోగినిలు హాజరై రాములవారి కళ్యాణాన్ని తిలకించించారు.
మామిడిపల్లిలో..
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో స్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దీంతో రాములగుట్ట రామనామస్మరణతో మారోగింది. యాజ్ఞచార్యులు మరింగంటి రామగోపాల చార్యులు, అర్చకులు తిరునహరి కృష్ణ, లక్ష్మణ్ ఆధ్వర్యంలో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, చందుర్తి సీఐ వేంకటేశ్వర్లు, ఎస్‌ఐ ప్రశాంత్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య, సూపరిండెంట్ వేంకటప్రసాద్, డీఈ మహిపాల్రెడ్డి, ఏఈ నాగరాజు, ఇన్చార్జీ నరేందర్, జూనియర్ అసిస్టెంట్లు దేవయ్య,లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచ్ రాం రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.