calender_icon.png 26 October, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లతో భవిష్యత్‌కు భరోసా

26-10-2024 01:37:58 AM

ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

మహబూబ్‌నగర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): టెక్నాలజీని అందిపుచ్చుకొని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు.

మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా పూర్తిచేస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో యువతకు పెద్దపెద్ద ఐటీ, నిర్మాణ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తారన్నారు. తదనంతరం డైట్ కళాశాల మైదానంలో టాస్క్ సెంటర్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి స్థల పరిశీలన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్ల శంకర్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మూడ చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితా మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.