రిటైర్మెంట్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన దశ. అయితే చాలామందికి ఆరోగ్యం, పెట్టబడులు, అత్యవసర నిధి లాంటివాటిపై అవగాహన లేకపోవడంతో మలివయసులో ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితమైన ప్రణాళికలు లేక పిల్లలపై ఆధారపడుతున్నారు. అందుకే పదవీ విరమణ తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు రూపోందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.
‘మార్నింగ్‌స్టార్ సెంటర్ ఫర్ రిటైర్మెంట్ అండ్ పాలసీ స్టడీస్’ సర్వే ప్రకారం.. 65 ఏళ్ల వయస్సులో పనిని మానేసిన 45% మంది అమెరికన్లు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. 55% ఒంటరి మహిళలు డబ్బులేమితో బాధపడుతున్నారు. అలాగే మన దేశంలో నలుగురిలో ఒకరికి సరైన రిటైర్‌మెంట్ ప్లానింగ్ తెలియక ఆర్థికంగా చితికి పోతున్నా రు. అందుకే బెస్ట్ రిటైర్‌మెంట్ ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
ఆదాయ ఆవసరాలు
* పదవీ విరమణకు ముందు బడ్జెట్‌ను సమీక్షించుకోవాలి.
* సౌకర్యవంతంగా జీవించడానికి అవసరమైన నెలవారీ ఆదాయ ప్రణాళికను తయారుచేసుకోవాలి.
* పదవీ విరమణ తర్వాత ప్రాథమిక ఖర్చులు అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి.
* పింఛన్, నెలవారీగా భృతి సమకూరేలా గ్యారంటీ ఆదాయ కార్యాచరణ రూపోందించడం
ఆర్థిక స్థిరత్వం
* ఆర్థిక మాంద్యం సమయంలో స్టాక్స్ పెట్టుబడులు ప్రమాదం.
* గ్యారంటీ ఆదాయం మాత్రమే ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది .
* హౌసింగ్, హెల్త్ కేర్, ఖర్చులు తరచుగా పెరుగుతాయి. అలాంటప్పుడు మార్కెట్ -ఆధారిత పెట్టుబడులపై ఆధారపడకుండా అవసరమైన వ్యయాలను చెల్లించగల సామర్థ్యం ఉండాలి.
* ప్రతి ఏడాది పెరిగే ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు.
* 40 ఏళ్ల నుంచే ప్రతి నెలా రూ.5 వేలను మదుపు చేస్తే రిటైర్‌మెంట్ తర్వాత దాదాపు ఒక కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పొందొచ్చు.
అత్యవసర ఫండ్
* చాలామందికి అత్యవసర ఫండ్ లేక అనారోగ్య సమయంలో ఇబ్బందు పాలవుతున్నారు.
* ఊహించని పరిస్థితుల్లో అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి.
* వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా ఉండాలి.
* రిటైర్మెంట్ ముందు ఐదేళ్లే నుంచి ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి.
* ఆరోగ్య పరీక్షలు, వైద్య చికిత్సలు, కొన్ని దశల్లో ఒక మెడికల్ అటెండెంట్‌ను కూడా నియమించుకోవాల్సి ఉంటుం ది. కాబట్టి ప్రత్యేక నిధి ఉండాల్సిందే.
పెట్టుబడులు
* పదవీ విరమణపై దృష్టి పెడుతున్నప్పుడు, స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్లక్ష్యం చేయొద్దు.
* పెట్టబడులు పెట్టడం వల్ల భవిష్యత్తు ఆర్థిక భరోసా ఉంటుంది.
* మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం కొంత సొమ్మును పొందవచ్చును.
కొన్ని ప్లాన్స్
* నెలవారీ ఆదాయ ప్రణాళికలు
* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
* పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్
* దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లు
* ప్రధాన మంత్రి వయయోజన పతకం
* జీవిత బీమా, పొదుపు