calender_icon.png 6 October, 2024 | 7:57 AM

రేపు సికింద్రాబాద్ రైలు షురూ

05-10-2024 01:15:26 AM

  1. ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  2. 19 స్టేషన్లలో ఆగనున్న వాస్కోడగామా రైలు

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రేపటి నుంచి సికిం ద్రాబాద్ రైల్వే సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆదివారం ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. తెలంగాణ నుంచి గోవాకు నేరుగా రైలు లేని తరుణంలో ఈ ఏడాది మార్చి 16న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

సికింద్రాబాద్ నుంచి గోవాకు ప్రత్యేకంగా ఓ రైలు నడపాలని విజ్ఞప్తి చే శారు. ఈ తరుణంలోనే ఈ ఏడాది జులై 6న సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు సేవలు ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రైల్వేబోర్డు అనుమతించిన అనంతరం సరిగ్గా 3 నెలల తర్వాత గోవా రైలు ప్రారంభమవుతోంది. ఈ రైలు ప్రారంభంతో గోవాకు వెళ్లే పర్యాటకులకు నేరుగా కనెక్టివిటీ లభించనుంది. 

వారానికి 2 సార్లు..

సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా మధ్య వారానికి 2 సార్లు ఈ రైలు తిరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో ఉద యం 10.05 గంటలకు ప్రారంభ మై మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడగామా చేరుకుంటుంది. ఇక వాస్కోడగామాలో రై లు గురు, శనివారాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రెండు నగరాల మధ్య 854 కి.మీ కాగా, ప్రయాణానికి 20 గంటల సమయం పడుతుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కాచీగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్ప ల్, గదగ్, హుబ్లీ, ధార్వాడ్, లోండా, కాజిల్ రాక్, కులేం, సాన్వోర్డెం, మడ్గాం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.