calender_icon.png 28 October, 2024 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ టు అయోధ్య

08-07-2024 02:12:08 AM

  • వయా వారణాసి భారత్ గౌరవ్ రైలు 
  • రేపు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం 
  • అయోధ్య రామయ్య చెంతకు ఆధ్యాత్మిక యాత్ర

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి చక్కని స్పందన రావడంతో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్య, -కాశీ పుణ్యక్షేత్ర యాత్రను చేపట్టింది. ఈ యాత్ర మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై వారణాసి, అయోధ్య, గయ యాత్ర పూర్తి చేసుకుని ఈ నెల 17న తిరిగి సికింద్రాబాద్‌కు రావడంతో ముగియనుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోందని రైల్వే శాఖ పేర్కొన్నది.

అయోధ్య రామయ్య చెంతకు..

నూతనంగా నిర్మించిన అయోధ్య రాము ని దేవాలయం సందర్శనకు ఇప్పటికే భక్తు లు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. అయితే ప్రత్యేకంగా రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపె ట్టిన భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్రంలో భాగంగా సికింద్రాబాద్ నుంచి అయోధ్య, వారణాసికి స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

9 రోజులపాటు ఈ యాత్ర పూర్తిగా ఆధ్యాత్మికంగా సాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని రైలు ప్రయాణికులందరికీ కొత్తగా నిర్మించిన అయోధ్యలోని రామ జన్మభూమి, జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ్ ఆలయం, గయ దర్శించుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ భారత్ గౌరవ్ రైలు తెలంగాణ లోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, టిట్లాగఢ్‌లలో(ఒడిశా) స్టేషన్‌లలో ప్రయాణికులను తీసుకుని బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలోనూ ఈ స్టేషన్లలో రైలు ఆగి ప్రయాణికులను దింపి వెళ్లుతుంది.

అన్ని సౌకర్యాలతో భారత్ గౌరవ్ రైలు

భారత్ గౌరవ్ రైలులో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు, రోడ్డు రవాణాతో సహా), వసతి, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్ -ఆన్-బోర్డు, ఆఫ్-బోర్డ్) రైల్వే శాఖనే చూసుకుంటుంది. ఈ సౌకర్యాన్ని తెలంగాణ, ఏపీ వాసులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ కోరారు.

యాత్ర వ్యవధి రోజులు

బోర్డింగ్, డీ బోర్డింగ్ స్టేషన్లు సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందు ర్తి, విజయనగరం, టిట్లాగఢ్. మరిన్ని వివరా ల కోసం ఐఆర్ సీటిసీ http://www.irc tctourism.comను సందర్శించవచ్చు.

ఒక్కొక్కరికీ టికెట్ ధర (జీఎస్టీతో)

ఎకానమీ క్యాటగిరీ (స్లీపర్): రూ.15,150

ప్రామాణిక వర్గం (3 ఏసీ): రూ.24,300

కంఫర్ట్ క్యాటగిరీ (2 ఏసీ): రూ.31,500