calender_icon.png 20 April, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడింది

28-03-2025 12:17:48 AM

కాపాడుకోవాల్సిన బాధ్యత  ప్రజాస్వామ్యవాదులపై ఉంది

హెచ్‌యూజే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్‌రెడ్డి

ముషీరాబాద్, మార్చి 27: (విజయక్రాంతి): దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య వాదులపై ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో  గురువారం రాత్రి  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఎంఏ ఫహీం తో కలిసి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం జర్నలిస్ట్ సోదరులకు కార్జుర ఫలాలు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు.

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం వారికి శుభం కలిగిం చాలని  శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హిం దూ, ముస్లింలు సోదర భావంతో మెలగాలని ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం అన్నారు. ఈ ఇఫ్తార్ విందులో హెచ్‌యూజే అధ్యక్షుడు శిగ శంకర్ గౌడ్, కార్యదర్శి షౌకత్ అలీ, టీయుడబ్ల్యూజే రాష్ట్ర  అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారా యణ, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, పలువురు  జర్నలిస్టులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.