హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర సచివాలయం పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ పోలీస్‌శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయానికి 500 మీటర్ల దూరం వరకూ ఈ సెక్షన్ అమలులో అంటుందని తెలిపింది. 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టంచేసింది. శాంతియుత ధర్నాలకు నగరంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని స్పష్టంచేసింది.