calender_icon.png 1 February, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచివాలయంలో 172 మంది సెక్షన్ ఆఫీసర్ల బదిలీ

01-02-2025 01:34:09 AM

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): సచివాలయంలో భారీ ఎత్తున ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. 172 మంది సెక్షన్ ఆఫీసర్లను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్షన్ ఆఫీసర్లను ఈ స్థాయిలో బదిలీ చేయడం ఇదే మొదటిసారి.

బదిలీ అయిన వారిలో జీఏడీ, వెల్ఫేర్, హోమ్, ఇరిగేషన్, ఇండస్డ్రీస్, ఎంఏయూడీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్, టూరిజం విభాగాల కు చెందిన ఆఫీసర్లు ఉన్నారు. పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది.