calender_icon.png 20 March, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ చట్టం అమలు..

19-03-2025 10:30:56 PM

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..

సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం నుంచి పత్రిక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 122 పరీక్షా కేంద్రాలలో 22,412 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని తెలిపారు.

పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను చేస్తూ.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.