05-03-2025 01:24:52 AM
కరీంనగర్, మార్చి 4 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలు మార్చి 5 బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కానుంది. సెలు ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకుని రావడానికి వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌక ర్యం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
మార్చి 5న మొదలై మార్చి 25 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో 17,790 మంది, రెండవ సంవత్స రంలో 17,762 మంది, మొత్తం 35,562 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నా రు. జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రా లను ఏర్పాటు చేశారు. మూడు ఫ్లుయింగ్ స్క్వాడ్స్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలో మొద టి సంవత్సరంలో 7073 మంది, రెండవ సంవత్సరంలో 7377 మంది, మొత్తం 14450 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొ త్తం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 5065 మంది, రెండవ సంవత్సరంలో 4245 మంది, మొత్తం 9310 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,844 మంది, రెండవ సంవత్సరంలో 5,141 మంది, మొత్తం 10,985 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 400 మంది ఇన్విజిలేటర్లను, 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25 మంది పర్యవేక్షకులు, 25 మంది అదనపు పర్యవేక్షకులను ఏర్పాటు చేశారు.