డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు శనివారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. తొలుత ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టి, ఆ తర్వాత ర్యాలీగా వెళ్లి సచివాలయాన్ని ముట్టడించాలని నిర్ణయిం చాయి.
దాదాపు రూ.4 వేల కోట్లు బకాయిలు విడుదల కావాల్సి ఉంది. టోకెన్లు జారీ అయినా విడుదలకానివి రూ.850 కోట్ల వరకు ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వహామీతో యాజమాన్యాలు శాంతించాయి. మొత్తం బకా యిలు విడుదల చేయకపోవడంతో మళ్లీ ఆందోళనకు పిలుపునిచ్చాయి.
మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ జూనియర్ కాలేజీలకు అనుమతుల విషయం కూడా ఇప్పటికే రచ్చకెక్కింది. ఈ విషయంలో అడ్డగోలు జరిమానాలపై తాజాగా ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరించాయి.
మార్చి 5 నుంచి జరిగే థియరీ పరీక్షలను సైతం బహిష్కరిస్తామని ఇప్పటికే హెచ్చరించాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్, వోకేషనల్ కాలేజీల యాజమాన్యాలు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆయా కాలేజీల యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి.