- సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు
- బెటాలియన్ పోలీసుల నిరసనల నేపథ్యంలో కీలక పరిణామం
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాం తి): సచివాలయం భద్రతను ప్రభుత్వం స్పెష ల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)కు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని సీఎస్ ఆదేశించారు.
ఇందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన నేపథ్యంలో సచివాలయం భద్రత విషయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి దాకా సెక్రట రియేట్ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(టీజీఎస్‌పీ) చూసుకుంది. ఇక నుంచి ఎస్‌పీఎఫ్ ఆ బాధ్యతలను చూసుకోనుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే టీజీఎస్‌పీను తొలగించి ఎస్‌పీఎఫ్‌ను తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నించింది. కానీ పార్లమెంట్ ఎన్నికల వల్ల ఆలస్యమైంది. ఆ తర్వాత పలుమార్లు ఈ అంశం చర్చకు వచ్చినా.. అంతకుమించిన కీలక అంశాలు ఉండటంతో ఈ ఫైల్‌ను ప్రభుత్వం పక్కనబెట్టింది. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఏక్ పోలీస్ నినాదంతో బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన చేపడుతున్నారు.
ఈ క్రమంలో సెక్రటరియేట్ భద్రత విషయంలో ముందస్తు చర్యగా ప్రభుత్వం ఎస్‌పీఎఫ్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోం ది. సచివాలయం సిబ్బంది ఎలాంటి ఆందోళన ల్లో పాల్గొనవద్దని, విధులకు హాజరు కావాలని.. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీచేసిన రెండు రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
650 మంది సిబ్బంది
వాస్తవానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి కీలక కార్యాలయాలు, ప్రాం గణాలకు భద్రతను కల్పించేందుకు ఎస్‌పీఎఫ్ సిబ్బందిని నియమిస్తారు. గతంలో సచివాలయం భద్రతను ఎస్‌పీఎఫ్ చూసుకునేది. కొత్తది నిర్మించాక కేసీఆర్ ప్రభుత్వం టీజీఎస్‌పీకి అప్పగించింది. ఇప్పుడు మళ్లీ భద్రత ఎస్‌పీఎఫ్ చేతికి వెళ్లింది. ప్రస్తుతం అన్నివేళల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్, రిజ ర్వ్ ఫోర్స్ కలిపి 650 మంది పహారా కాస్తున్నారు. ఇప్పుడు వీరి స్థానంలో ఎస్‌పీఎఫ్ సిబ్బంది రానున్నారు.