రెండు రోజులుగా పడిగాపులు.. పట్టించుకోని అధికారులు
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ఆర్టీసీలో పనిచేస్తూ కేసులు నమోదై న డ్రైవర్లు, కండక్టర్లు సహా వివిధ కారణాలతోసస్పెన్షన్‌కు గురైన, విధుల నుంచి తొల గించబడిన కార్మికులు తమ సమస్యలను చెప్పుకొనేందుకు సచివాలయానికి వస్తున్నారు.
రెండు రోజులుగా పడిగాపులు పడుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని వారు వాపోతున్నారు. అధికారుల తీరువల్ల పలువురు కార్మికులు చిన్న చిన్న కేసులతో ఉద్యోగాలు కోల్పోయారని, వారిని ఆదుకుని కుటుంబాలను కాపాడాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
డిసెంబర్ 5న చలో సెక్రటేరియట్
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 5న చేపట్టే చలో సెక్రటేరియట్ విజయవం తం చేయాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న పిలుపునిచ్చారు. మంగళవారం ఉప్పల్ ఆర్టీసీ డిపోలో కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వం లాగే కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తోందని ఆగ్రం వ్యక్తంచేశారు. అందుకే ఈ ప్రభుత్వం తీరును నిరసిస్తూ చేపట్టిన చలో సెక్రటేరియట్‌ను విజయవంతం చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు.