calender_icon.png 24 February, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదడు ఆరోగ్య రహస్యమిదే

16-02-2025 12:00:00 AM

కొంతమందిలో వయసు పెరుగుతున్నా, ఆ ఛాయలు వాళ్ల శరీరంలో పెద్దగా కనిపించవు. 60 ఏళ్ల వయసులోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరు 30 కూడా నిండకుండానే 50 దాటినట్లు ప్రవర్తిస్తారు. అయితే ఇలాంటి వాళ్ల మెదడు వయసుని కనిపెట్టడం ఎలా? అని ఆలోచించారు స్వీడన్‌లోని కరోలిన్స్‌కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు. ఇందుకోసం 70 ఏళ్లు దాటి శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉన్నవారిని, అలాగే అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారిని కూడా తీసుకుని వారి మెదడుని ఏఐ సాయంతో విశ్లేషించారు. డయాబెటిస్, గుండెజబ్బులు ఉన్నవారితోపాటూ రక్తనాళాలు బలహీనంగా ఉన్నవారిలో కూడా మెదడు చురుగ్గా లేకపోవడం, వయసుకుమించి వృద్ధాప్య లక్షణాలు ఉండటం గమనించారు. ఇక కొందరిలో, వాళ్ల శారీరక వయసు కన్నా, మెదడు వయసు తక్కువగా ఉండటం గుర్తించారు. ఇందుకు కారణాన్ని విశ్లేషించినప్పుడు వాళ్లంతా మంచి అలవాట్లకి ప్రాధాన్యం ఇస్తూ వ్యాయామం, పోషకాహార నియమాలపై దృష్టి పెట్టారని తెలిసింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, చక్కని డైట్ తీసుకుంటే ఎవరైనా ఎప్పటికీ చురుగ్గా ఉండొచ్చు.