రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో సూర్మా హాకీ క్లబ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సూర్మా 2-1తో ఒడిశా వారియర్స్‌ను చిత్తు చేసింది. సూర్మా తరఫున హినా బానో (6వ నిమిషంలో), సోనమ్ (47వ ని.లో) గోల్స్ చేయ గా.. ఫ్రీక్ మోస్ (57వ ని.లో) ఒడిశాకు ఏకైక గోల్ అందించింది. పురుషుల విభాగంలో యూపీ రుద్రాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-5తో బెంగాల్ గెలుపొందింది. బెంగాల్ తరఫున బొక్కార్డ్ (8వ ని.లో), జుగ్‌రాజ్ (10వ, 33వ ని.లో), సుఖ్‌జీత్ (14వ ని.లో), అభిషేక్ (46వ ని.లో) గోల్స్ చేయగా.. హార్ది క్ (47వ ని.లో), సామ్ (51వ, 59వ ని.లో) యూపీకి గోల్స్ అందించారు.