హాకీ ఇండియా లీగ్...
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో కళింగ లాన్సర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం రూర్కెలాని బిర్సా ముండా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ 2 టీమ్ గొనాసికాపై గెలుపొందింది. కళింగ తరఫున ఆంటోని కినా (ఆట 28వ నిమిషంలో), ఆరన్ జలెస్కీ (33వ ని.లో) గోల్స్ కొట్టగా.. సునీల్ (14వ ని.లో) టీమ్ గొనాసికాకు ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో కళింగ లాన్సర్స్ ఏడు పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా.. టీమ్ గొనాసికా ఏడో స్థానంలో కొనసాగుతోంది. నేడు జరగనున్న మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్‌తో బెంగాల్ టైగర్స్ అమీతుమీ తేల్చుకోనుంది.