calender_icon.png 25 February, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా-ఏకు రెండో విజయం

22-10-2024 01:06:03 AM

దుబాయ్: ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది.

రాహుల్ చోప్రా (50) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రసిక్ సలామ్ 3, రమణ్‌దీప్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఇండియా-ఏ 10.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (58) మెరుపు అర్థసెంచరీతో రాణించాడు. ఇండియా-ఏ తన తర్వాతి మ్యాచ్ బుధవారం ఒమన్‌తో ఆడనుంది.