calender_icon.png 12 January, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంగ్లండ్‌కు రెండో విజయం

08-10-2024 12:07:04 AM

 మహిళల టీ20 ప్రపంచకప్

షార్జా: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం గ్రూప్ భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వర్ట్ (42 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

మిడిలార్డర్‌లో మారిజన్ కాప్ (26), డెర్క్‌సెన్ (20) పర్వాలేద నిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎసెల్‌స్టోన్ 2 వికెట్లు తీయగా.. స్మిత్, చార్లీ, సారా తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ఓపెనర్ డానీ హడ్జ్ (43), నట్ సివర్ (48 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సఫారీ బౌలర్లలో కాప్, క్లర్క్ చెరో వికెట్ పడగొట్టారు. సోఫీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకుంది. వరుసగా రెండు విజయాలు సాధించిన ఇంగ్లండ్ గ్రూప్ టాప్‌లో నిలిచి సెమీస్ రేసులో మరింత ముందంజ వేసింది.