calender_icon.png 16 January, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి రెండో రౌండ్

12-09-2024 12:52:21 AM

అనంతపురం: ప్రతిష్ఠాత్మక దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లకు నేటి నుంచి తెరలేవనుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఇండియాుూబి 76 పరుగుల తేడాతో ఇండియా జట్టుపై విజయం సాధించగా.. ఇండియా 4 వికెట్ల తేడాతో ఇండియా డిపై గెలుపొందింది. కాగా రెండో రౌండ్ మ్యాచ్‌లకు అనంతపురం వేదిక కానుంది. అనంతపురంలో కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఇండియా ఇండియా ఇండియా  ఇండియా తలపడనున్నాయి. 

శ్రేయస్‌పై నజర్..

రెండో రౌండ్  మ్యాచ్‌ల సందర్భంగా అందరి కళ్లు శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లపైనే ఉంది. రింకూ సింగ్ దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. సీనియర్లు బరిలోకి దిగడంతో అతడిని ఎంపిక చేయలేదు. ఇండియా జట్టు కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోవడంతో పాటు జాతీయ జట్టులోకి అడుగుపెట్టాలంటే తదుపరి రెండు మ్యాచ్‌లు అత్యంత కీలకం.

సర్ఫరాజ్ తొలి టెస్టుకు ఎంపికైనప్పటికీ కేఎల్ రాహుల్ ఉండడంతో మిడిలార్డర్‌లో చోటు దక్కడం కష్టమే. దీంతో రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆడి ఫామ్‌లోకి రావాలని సర్ఫరాజ్ భావిస్తున్నాడు. వీళ్లతో పాటు తిలక్ వర్మ, రుతురాజ్, పడిక్కల్, దూబే, రియాన్ పరాగ్, సాయి సుదర్శన్ బరిలో ఉన్నారు.