03-03-2025 12:08:46 AM
కరీంనగర్, మార్చి 2 (విజయక్రాంతి) : పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు మొదటి రోజే వెల్లడి కానుండగా, పట్టభద్రుల స్థానం లెక్కింపునకు రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈసారి ఓటింగ్‌శాతం పెరిగింది.
అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి విజయం చేకూర్చుతుందన్న చర్చ ప్రస్తుతం అన్ని వర్గాల్లో నడుస్తున్నది. అభ్యర్థులు ఎవరికివారు గెలుపు దీమలో ఉన్న వారితో పాటు కాంగ్రెస్ బిజెపి శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలపై అంత ఉత్కంఠత లేదు, ఫలితం ఒక వైపు కనిపిష్టిస్తుండగా పట్టభద్రుల విషయంలో మాత్రం అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ కనిపిస్తున్నది.
పట్టభద్రులకు సంబంధించి మొత్తం 3,55,159 మంది ఓటర్లు ఉండగా.. అందులో 2,50,106 మంది (70.42 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 1,05,053 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. నిజానికి ఈసారి ఓటర్ల నమో దు విషయంపై బరిలో నిచిలిన అభ్యర్థుల్లో చాలా మంది దృష్టిపెట్టారు. ఫలితంగా భారీ గా ఎన్‌రోల్‌మెంట్ జరిగింది.
అయితే ప్రస్తుతం జరిగిన పోలింగ్ ప్రకారం చూస్తే యాభైశాతం దాటి అంటే 1,25,053కి పైగా ఓట్లు వస్తే మొదటి ప్రా ధాన్యతతో సదరు అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు. పట్టభద్రుల స్థానం విషయం లో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే మాత్రం బరిలో ఉన్న ఏ అభ్యర్థికి కూడా మొదటి ప్రా ధాన్యతతో గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.
దీంతో రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రస్తు తం పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో ప్రా ధాన్యతకు వెళ్లాల్సి వస్తే ముం దుగా అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి వద్ద నుంచి ఎలిమినేట్ ప్రక్రియ ప్రారంభమ వుతుంది.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించాల్సి వస్తే చాలా మంది అంచనాలు తారుమారయ్యే అవకాశమున్నది ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ కనిపిస్తున్నది. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి, మధ్యే గెలుపోటములు ఉండనున్నాయి.
ముగ్గురిలోనూ ఏ ఒక్కరికీ మొదటి దఫాలోనే యాభైశాతానికి మించి వచ్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యతకు వెళ్తే అక్కడ ఎవరి తలరాతలు తారుమారు అవుతాయో అన్న చర్చ ప్రస్తుతం ఆయా వర్గాల్లో నడుస్తున్నది. ఈనేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓటు తనకంటే.. తనకు వచ్చిందంటూ అభ్యర్థులు అంచనాలు వేసుకుంటూ ఎవరికి వా రే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఫలితాలు కొంత క్లియర్‌కట్‌గానే కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలిం గ్ సరళిని చూస్తే పీఆర్టీయూ నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేసిన మల్కా కొమురయ్య మధ్యే గెలుపోటములుంటాయన్న అభిప్రాయాలున్నాయి. అందులోనూ ఈసారి పార్టీ అభ్యర్థే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.