హైదరాబాద్: పీకేఎల్ 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ రెండో స్థానా నికి దూసుకొచ్చింది. శనివారం పునేరి పల్టన్తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 34-11 తేడాతో పునేరి పల్టన్పై గెలుపు బావుటా ఎగరేసింది. కెప్టెన్ పవన్ షెరావత్తో పాటుగా.. ఆల్రౌండర్ విజయ్ మాలిక్ కూడా సూపర్ టెన్ సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంకజ్ మోహిత్ 8 రెయిడ్ పాయింట్లతో పాటు ఓ టాకిల్ పాయింట్ కూడా సాధించాడు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 29-40 తేడాతో బెంగాల్ వారియర్జ్ చేతిలో ఓడిపోయింది. వరుస ఓటముల నుంచి తేరుకుందనుకునే లోపే బెంగళూరు మరో ఓటమిని మూటగట్టుకుంది. బెంగాల్లో స్టార్ రైడర్ మనీందర్ సింగ్ సూపర్ టెన్తో చెలరేగాడు. శనివారంతో హైదరాబాద్ వేదికగా మ్యాచ్లు ముగియగా.. నేటి నుంచి నోయిడాలో జరగనున్నాయి.