calender_icon.png 21 April, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోబోటిక్స్ పోటీలో రెండో స్థానం

12-04-2025 12:19:09 AM

హైదరాబాద్ వీఆర్‌ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): జాతీయ స్థాయి రోబోటిక్స్ పోటీలో హైదరా బాద్ వీఆర్‌ఎస్ విజ్ఞాన జ్యోతి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు రెండోస్థానంలో నిలిచారు. మార్చి 29, 30 తేదీలలో ఐఐటీ ఢిల్లీలో నిర్వహించిన టెక్‌రేడియన్స్ జాతీయ స్థాయి రోబో టిక్స్ పోటీలో వీఆర్‌ఎస్ విజ్ఞాన జ్యోతి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు తమ అసాధారణ మైన ప్రతిభను ప్రదర్శించారు.

దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువతతో పోటీ పడుతూ అత్యుత్తమ ప్రదర్శనతో 2వ స్థానం సాధించా రు. ఈ పోటీలో 138 జట్లు పాల్గొన్నాయి. వాటిలో 34 జట్లు తుది దశకు అర్హత సాధించగా.. విజ్ఞాన జ్యోతి స్కూల్ నుంచి 6 జట్లు ఫైనల్‌కు ఎంపికయ్యాయి. తుది పోటీలో విద్యార్థులు సాంకేతిక నైపుణ్యం, సమస్యల పరిష్కరణ సామర్థ్యం, నూతన ఆలోచనలు ప్రదర్శించి జ్ఞానాన్ని చాటుకున్నారు.

వీరు రోబోటిక్ మోడల్‌ను అర్డుయినో ప్రోగ్రామిం గ్ లాంగ్వేజ్ ఉపయోగించి రూపొందించారు. ఇది C++కి సమానమైనది. కోడింగ్, లాజికల్ థింకింగ్, ఇంజనీరింగ్ సూత్రాలను సమర్థవంతంగా ఉపయోగించి విజయం సాధించారు. ఈ విశేష విజయాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విజేతలను పాఠశాల ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ రమణశ్రీ వల్లూరుపల్లి  అభినందిం చి బహుమతులు అందజేశారు.