calender_icon.png 25 February, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేపర్‌లెస్ విధానంపై రెండో విడత శిక్షణ

25-02-2025 12:00:00 AM

మణుగూరు, ఫిబ్రవరి 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అమలు కానున్న పేపర్ లెస్ విధానంపై ఎస్‌ఓటు జిఎం డి శ్యామ్ సుందర్ అధ్యక్షతన ఏరియా ఉన్నత అధికారులకు, ఆయా విభాగాల అధికారులకు ఐటి విభాగం ఆధ్వర్యంలో సోమవారం రెండవ విడత ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహింఛారు. 

కార్యక్రమంలో సీనియర్ ఐటి  ప్రోగ్రామర్ సాయిల సురేశ్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా ఉత్తర, ప్రత్యుత్తరాలు, సర్క్యులర్ లు కాగితాల పైన జరుగుతూ ఉన్నాయని. ఇక పై అన్ని రకాల ఉత్తర, ప్రత్యుత్తరాలు ద్వారా మాత్రమే జరగడానికి ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రోగ్రాంను తయారు చేయడం జరిగిందన్నారు.

దీని వినియోగం వలన సమయం ఆదా అవడమే కాక కాగితం వాడకం పూర్తిగా తగ్గించుకోవచ్చన్నారు. ఈ మేరకు యాజమాన్యం నిర్ణయం తీసుకొని మొదటి విడుతలో అన్ని ఏరియాల అధికారులకు మొదటి విడతగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రెండవ విడత శిక్షణ కార్యక్రమంలో సంబందిత అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ ప్రక్రియ వల్ల సమాచారం మొత్తం ఆన్ లైన్ లో ఎల్లప్పట్టికి భద్రంగా ఉంటుంది కాబట్టి ఇక పై నూతన విధానాన్నే కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో  డిజిఎం ఎం అనురాధా, పికేఓసి సేఫ్టీ అధికారి లింగ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓసి స్టోర్స్ ఎం సత్యనారాయణ,

డివైఎస్‌ఈ రామకృష్ణ, సీనియర్ పిఓలు వి రామేశ్వర రావు, ఓంకార్ బాపు, డి.నరేశ్, ప్రోగ్రామ్మర్ (ఐటి) ఈఆర్‌పి రమ్య, మేనేజ్మెంట్ ట్రైనీ(సిస్టమ్స్) శ్రీకర్ తేజ మేనేజ్మెంట్ ట్రైనీ ( పర్సనల్)  సాయి శ్వేత, ఎస్ చంద్రకిరణ్, అరుణ్ తేజ, వంశీ కృష్ణ అన్నీ విభాగాల మినిస్ట్రియల్ స్టాఫ్ పాల్గొన్నారు.