calender_icon.png 29 September, 2024 | 5:58 PM

మెట్రో రైలు రెండో దశ తుది మెరుగులు

29-09-2024 03:19:55 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ కు తుది మెరుగులు దిద్దుకుంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశ పనులను రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించనుంది. రెండో దశలో కొత్తగా ప్యూచర్ సిటీకి మెట్రోరైలు ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40 కిలోమీటర్లు మేర మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.

ఎయిర్ పోర్టు మెట్రో అలైన్ మెంట్ మార్పు చేశారు. ఆరాంఘర్ - బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో ఖరారు చేశారు. కారిడార్ - 4లో నాగోల్ - శంషాబాద్ విమానాశ్రయ వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదించారు. ఎయిర్ పోర్టు కారిడార్ లో  1.6 కిలోమీటర్లు భూగర్భంలో వెళ్లనున్న మెట్రోను నాలుగో నగరానికి రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించనున్నారు. కేంద్రప్రబుత్వ అనుమతుల కోసం మెట్రో రెండో దశ డీపీఆర్ లు త్వరలోనే సిద్ధం చేయాలన్ని ఆదేశించారు.