calender_icon.png 21 February, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి రెండో దఫా కులగణన

16-02-2025 12:00:00 AM

  1. 28 వరకు కొనసాగనున్న సర్వే
  2. మూడు పద్ధతుల్లో వివరాల సేకరణ
  3. మిగిలిపోయిన కుటుంబాలు 3.56 లక్షలకు పైగా

హైదరాబాద్, ఫిబ్రవరి 15(విజయక్రాంతి): రాష్ట్రంలో రెండో దఫా కులగణన సర్వే నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడుతలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం రెండోసారి అవకాశం కల్పించింది. ఈ నెల 28వ తేదీ వరకు సర్వే కొనసాగనుంది. మొదటిసారి నిర్వహించిన కులగణన సర్వేకు 3,56,323 కుటుంబాలు దూరంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

వీరిలో కొందరి ఇళ్లకు తాళాలు వేసి ఉండగా.. మరికొందరు వివరాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో మిగిలిపోయిన వారి నుంచి మూడు పద్ధతుల్లో ప్రభుత్వం వివరాలను సేకరించనుంది. మొదటి ఆప్షన్‌లో టోల్ ఫ్రీ నంబర్ 040--21111111 కు కాల్ చేసి వివరాలను వెల్లడించడం లేదా ఎన్యుమరేటర్‌ను ఇంటికి పిలిచి వివరాలను ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.

రెండో ఆప్షన్‌గా గ్రామీణ, మండల కేంద్రాల్లోని ప్రజా పాలన కేంద్రాలకు వెళ్లి వివరాలు తెలపవచ్చు. ఈ కేంద్రాల వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు అందుబాటులో ఉంటారు. ఇక మూడో ఆప్షన్‌గా ఆన్‌లైన్‌లో <https://seeepcsurvey.cgg.gov.in>  నుంచి సర్వే ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి దాన్ని నింపి సంతకం చేసిన తర్వాత ప్రజా పాలన కేంద్రాల్లో సమర్పించవచ్చు.