calender_icon.png 29 September, 2024 | 1:49 PM

నేటి నుంచి రెండో చంద్రుడు

29-09-2024 01:50:55 AM

భూమి చుట్టూ తిరగనున్న ఉల్క

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఖగోళంలో అత్యంత అరుదైన దృశ్యం నేడు ఆవిష్కృతం కానున్నది. భూమికి కొంతకాలంపాటు రెండో చంద్రుడు వచ్చి చేరనున్నాడు. భూమికి ఉన్న ఒకే ఒక్క ఉపగ్రహం చంద్రుడు అన్న సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఒక చిన్న ఉల్క భూమి చుట్టూ తిరగనున్నది.

ఇది మనకు చిన్నపాటి చంద్రుడిలా కనిపిస్తుంది. అందుకే రెండో చంద్రుడు  అని అంతా పేర్కొంటున్నారు. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి 2024 పీటీ 5 అనే ఉల్క వేరుపడి తిరుగుతున్నది. ఇది భూమి గురుత్వాకర్షణ శక్తికి లోను కావటంతో ఇటువైపు వచ్చింది. కొంతకాలం భూమి కక్షలో తిరుగనున్నది.

దీని రాకను నాసాకు చెందిన ఆస్టరాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టం (అట్లాస్) ఆగస్టు 7వ తేదీన గుర్తించింది. ఈ ఆస్టరాయిడ్ 33 అడుగుల వ్యాసార్ధంలో ఉన్నది. ఇది భూమిచుట్టూ తిరిగే సమయంలో చిన్న చుక్కలా కనిపిస్తుందని ఆసమ్ ఆస్ట్రానమీ పాడ్‌కాస్ట్ వ్యాఖ్యాత డాక్టర్ జెన్నిఫర్ మిల్లార్డ్ తెలిపారు.