పారిస్: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ రెండో పతకం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యం పతకం సాధించింది. కాంస్య పతకం మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడి కొరియాతో పోటీ పడి సాధించారు. కొరియా జోడిపై భారత్ జోడి 16-10 పాయింట్ల తేడాతో కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ పోటీలో కొరియా జోడి 10 పాయింట్లు సాధించగా, భారత్ జోడి 16 పాయింట్లు సాధించింది. భారత్ తరుపున మను భాకర్ ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్యం గెలువగా.. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ గా రికార్డు సాధించింది.