calender_icon.png 22 April, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెకండ్ డాకింగ్ సక్సెస్

22-04-2025 12:18:19 AM

ఇస్రో మరో ఘనత

ఆనందం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

న్యూఢిల్లీ: స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను ఇస్రో మరోమారు విజయవంతంగా పూర్తి చేసింది. రెండో డాకింగ్ ప్రక్రియ విజయవంతమైనట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో పాటు, ఇస్రో కూడా ప్రకటించింది. ‘ఉపగ్రహాల రెండో డాకింగ్ కూడా పూర్తయింది. ఈ విషయం ఎంతో ఆనందాన్నిస్తుంది. జనవరి 16న డాకింగ్, మార్చి 13న అన్‌డాకింగ్ పూర్తి చేశాం. రాబోయే రెండు వారాల్లో మరిన్ని కొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఇస్రో డిసెంబర్ 30 2024న స్పేడెక్స్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్ 4, మానవ సహిత అంతరిక్షయాత్ర, సొంత అంతరిక్ష కేంద్రం వంటి వాటి కోసం ఈ ప్రయోగం ఎంతో కీలకం.