calender_icon.png 29 September, 2024 | 2:57 PM

తిరుమల లడ్డూ కల్తీపై రెండో రోజు సిట్ విచారణ

29-09-2024 12:35:42 PM

అమరావతి: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు సెట్ విచారణ చేస్తోంది. తిరుపతి పోలీస్ అతిథిగృహంలో మరోసారి సెట్ సభ్యుల భేటీ అయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడి సెట్ విచారణ చేపట్టనుంది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సెట్ పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు , సిబ్బంది పాత్ర వరకు  అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ టీటీడీ ఈవో శ్యామలరావును సెట్ సభ్యులు కలవనున్నారు. ఈవోను అడిగి పూర్తివివరాలు తెలుసుకోనున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సభ్యులు తమిళనాడు వెళ్లనున్నారు.దుండిగల్ లో ఏఆర్ డెయిరీ పుడ్స్ సంస్థను సిట్ పరిశీలించనుంది.

తిరుమల లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు మరో బృందం పరిశీలించనున్నట్లు సమాచారం. లడ్డూ తయారీ ముడిసరుకులను సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను సిట్ ప్రశ్నించనుంది. తిరుమల టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నెయ్యి సరఫరాలపై టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య ఒప్పందాలను సిట్ పరిశీలించనుంది.