calender_icon.png 5 October, 2024 | 12:56 PM

రెండో రోజూ డౌన్

06-09-2024 12:00:00 AM

  1. మరో 150 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ 
  2. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు

ముంబై, సెప్టెంబర్ 5: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో భారత సూచీలు వరుసగా రెండో రోజూ క్షీణించాయి. గురువారం ట్రేడింగ్ తొలిదశలో పెరిగిన మార్కెట్ మధ్యాహ్న సెషన్ నుంచి నష్టాల్లోకి జారిపోయింది. ప్రారంభంలో 300 పాయింట్లకుపైగా పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 82,617 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ఆ స్థాయి నుంచి 82,130 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. తుదకు 151 పాయింటు కోల్పోయి 82,202 పాయింట్ల వద్ద నిలిచింది. 

ఇదేబాటలో  నిఫ్టీ 25,275 పాయింట్ల గరిష్ఠ, కనిష్ఠస్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యిం ది. చివరకు 53 పాయింట్ల క్షీణతతో 25,145 పాయింట్ల కొత్త వద్ద ముగిసింది.  ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు తగ్గగా,  షాంఘై గ్రీన్‌లో ముగిసింది. యూరప్ సూచీలు స్వల్ప నష్టాలతో క్లోజయ్యాయి.

టైటాన్ టాప్ గెయినర్ 

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టైటాన్ షేరు  3  శాతం పైగా పెరిగిం ది.  ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యాలు 1 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు  రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతంపైగా తగ్గింది. టాటా మోటార్స్, నెస్లే, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, లార్సన్ అండ్ టుబ్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రాలు నష్టపోయాయి.వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా రియల్టీ ఇండెక్స్ 0.95 శాతం తగ్గింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.61 శాతం, ఇండస్ట్రి యల్స్ ఇండెక్స్ 0.38 శాతం, పవర్ ఇండెక్స్ 0.37 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.30 శాతం చొప్పున తగ్గాయి. మెటల్ ఇండెక్స్ 1.11 శాతం తగ్గింది. 

ఐటీ ఇండెక్స్ 0.91 శాతం, టెలికమ్యునికేషన్ ఇండెక్స్ 0.82 శాతం, టెక్నాలజీ ఇండె క్స్ 0.71 శాతం, బ్యాంకెక్స్ 0.70 శాతం చొప్పున తగ్గాయి. హెల్త్‌కేర్, కమోడిటీస్, రియల్టీ, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్, టెలికమ్యూనికేషన్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఐటీ, టెక్నాలజీ ఇండెక్స్‌లు  పెరిగాయి.  బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం చొప్పున లాభపడ్డాయి.